పన్ను వసూళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

పన్ను వసూళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎంపీడీవో ఇమ్రాన్ శనివారం పన్ను వసూళ్ల ప్రక్రియను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి చెల్లించే పన్నులు ప్రధాన ఆదాయ వనరులు అని ఎంపీడీవో అన్నారు. గ్రామంలో శుభ్రత, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంటి పన్ను చెల్లించాలని సూచించారు.