ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన కలెక్టర్
NTR: ఏ.కొండూరు మండలం రామన్నపాలెంలో కలెక్టర్ లక్ష్మీశా గురువారం పర్యటించారు. గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో దాదాపు 30 రకాల పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దుంప, తీగ జాతులను పండిస్తున్న వైనాన్ని ఆయన ఆసక్తిగా పరిశీలించారు. పంటల ద్వారా పొందే విధానాన్ని, మార్కెటింగ్ చేస్తున్న తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.