రహదారి మధ్యలో ఏర్పడ్డ గుంత
CTR: పుంగనూరు NS పేట రహదారి మధ్యలో గుంత ఏర్పడింది. సుమారు రెండు అడుగుల లోతుతో ఈ గుంత ఉంది. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రామసముద్రానికి వెళ్లాల్సింది కూడా ఈ మార్గంలోనే. వాహన చోదకులు, పాదాచారులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి గుంతలో నీరు చేరాయి.