దట్ట మంచుతో ప్రజలు ఇబ్బందులు

దట్ట మంచుతో ప్రజలు ఇబ్బందులు

AKP: కోటవురట్లలో ఆదివారం వేకువజాము నుంచే దట్టమైన మంచు కురవడంతో చలి తీవ్రంగా పెరిగింది. పొగమంచు ఆవరించడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని వాకర్ త్రిమూర్తులు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగానే ఈ భిన్న వాతావరణం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. వాకింగ్‌కూడా చేయలేకపోతున్నామన్నారు.