VIDEO: 'పూజ చేస్తుంటే కత్తితో దాడి చేశాడు'
ప్రకాశం: కనిగిరిలోని సాయిబాబా థియేటర్ సమీపంలో సుబ్బులు అనే మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఎస్సై టి. శ్రీరామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను దాడి ఎలా జరిగిందనే కోణంలో విచారించారు. తాను పూజ చేస్తుంటే శివ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడని, ఎందుకు దాడి చేశాడో తెలియదని ఎస్సై కు సుబ్బులు వాంగ్మూలం ఇచ్చింది.