ఈ నెల 22 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో పేదల తిరుపతిగా పిలువబడే కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమై, వచ్చేనెల 7 వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామివారి అలంకరణ మహోత్సవం, 28 న ఉద్దాల మహోత్సవం నిర్వహించనునట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.