VIDEO: RDO ఆఫీస్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అన్నమయ్య: రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.