నిజాంపేటలో ఎమ్మెల్యే వివేకానంద, ఎంపీ అభ్యర్థి రాగిడి ప్రచారం

నిజాంపేటలో ఎమ్మెల్యే వివేకానంద, ఎంపీ అభ్యర్థి రాగిడి ప్రచారం

హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం నిజాంపేటలోని శ్రీరాం కుంట పార్కు వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కలిసి పలువురు వాకర్స్‌తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస పార్టీని గెలిపించాలని కోరారు.