గోదావరిలో పడి యువకుడు గల్లంతు
PDPL: మంథనిలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన రావి కంటి సాయి కృష్ణ అనే యువకుడు సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. అతని చెప్పులు, బట్టలు ఒడ్డున కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంథని పోలీస్, ఫైర్ రెస్క్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రోజూ మాదిరిగానే స్నానానికి వచ్చిన సాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.