'ప్రతి ఒక్కరూ సూర్యఘర్ సోలార్ పథకం వినియోగించుకోండి'
CTR: పీఎం సూర్య ఘర్ సోలార్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు కోరారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలార్ ప్లాంట్ ప్రారంభించి, డా. బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.