'కారుణ్య నియామకాలతో ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాలకు భరోసా'
MHBD: ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతుందని, అలాంటి సమయంలో బాధిత కుటుంబాలను ఒంటరిగా విడిచిపెట్టకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం కొత్తగూడ మండలలోని ఐటీడీఏ అతిథి గృహం పరిధిలో వివిధ కారణాలతో మరణించిన 17 మంది ఉద్యోగుల కుటుంబాలకు గాను ప్రాథమికంగా ముగ్గురు లబ్ధిదారులకు మంత్రి స్వయంగా కారుణ్య నియామక పత్రాలు అందించారు.