తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన భారత్
టీమిండియా అంధుల మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంక వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 115 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫూలా సారెన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇది భారత జట్టు అంధుల మహిళా విభాగంలో తొలి ప్రపంచ కప్ కావడం విశేషం.