గోదావరి నది వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు

గోదావరి నది వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు

PDPL: గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నది వద్ద టూ టౌన్ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో వరద నీరు దిగువకు చేరుతుంది. ఈ క్రమంలో పట్టణ శివారులో ఉన్న నదిలో వరద నీటి ఉద్ధృతి పెరిగిందని పోలీసులు తెలిపారు. అయితే స్నానాలకు గానీ ఏ ఇతర అవసరాలకు గానీ నది వద్దకు వెళ్ళ వద్దన్నారు.