వృక్షరూపంలో స్త్రీతత్వం
కోనసీమ: రామచంద్రపురం మండలం నరసాపురపుపేట ప్రభుత్వ హైస్కూల్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు రాయుడు త్రినాథ ప్రసాద్ ఆదివారం ప్రత్యేక చిత్రాన్ని ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వృక్షరూపంలో స్త్రీతత్వాన్ని అద్భుతంగా చిత్రించారు. చెట్టు కొమ్మలను కూతురు, తల్లి, భార్య అనురాగానికి ప్రతీకలుగా, భూమిని స్త్రీ సహనానికి నిదర్శనంగా చూపారు.