అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
ELR: ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాల విజన్ 2047 సిబ్బందితో MLA పత్సమట్ల ధర్మరాజు సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన పల్లె పల్లెకు కార్యక్రమంలో భాగంగా మండలంలో ప్రతి ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. అలాగే ఆ గ్రామాల్లో అవసరాలను తీర్చాలని సూచించారు.