నెల్లూరుకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆదివారం నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.