యువకుడిని రక్షించిన పోలీసులు

E.G: మనస్థాపానికి గురై ఓ యువకుడు సూసైడ్ చేసుకునే క్రమంలో పోలీసులు రక్షించారు. త్రీ టౌన్ సీఐ అప్పారావు వివరాల మేరకు.. గాజువాకకు చెందిన సన్యాసినాయుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. క్యాసినో గేమ్ బెట్టింగ్‌కు బానిసై రూ.50 వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బుధవారం రాజమండ్రికి చేరుకొని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో దూకాడు. పోలీసులు గమనించి అతనిని రక్షించారు.