సింగపూర్‌లో పట్టణ ప్రణాళికపై సత్యకుమార్ అధ్యయనం

సింగపూర్‌లో పట్టణ ప్రణాళికపై సత్యకుమార్ అధ్యయనం

SS: మంత్రి సత్యకుమార్ యాదవ్ సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు పట్టణ ప్రణాళికా విధానాలను నిశితంగా పరిశీలించారు. యూఆర్ఏ గ్యాలరీని సందర్శించి ఆ దేశం అనుసరిస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయంపై అధ్యయనం చేశారు. అనంతరం ఎన్ యూఎస్ సీటీస్‌లో జరిగిన కీలక సెషన్లలో పాల్గొన్నారు. అభివృద్ధి సాధించే మార్గాలపై అధికారులతో చర్చించారు.