పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ

పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. CM పర్యటన విజయవంతమైన సందర్భంగా పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్దన్ రాజు అభినందించారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లిలో MSME పార్కులను ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో కలెక్టర్ రాజబాబు, SP చంద్రబాబు నాయుడును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించినట్లు హర్షవర్దన్ చెప్పారు.