HYD అభివృద్ధిలో వైఎస్, చంద్రబాబు పాత్ర ఉంది: సీఎం

HYD: 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ను అప్పటి సీఎంలు అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం గచ్చిబౌలిలో రిజిస్ట్రార్ ఆఫీసులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థల్లో తెలుగువారు పెద్ద పదవుల్లో ఉన్నారన్నారు.