మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన జిల్లా ఎస్పీ

KMR: నేర పరిశోధనలో ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లాకు ఒక కొత్త మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసింది. ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర గురువారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి పాలుగోన్నారు.