జగనన్న కాలనీకి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు
E.G: గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామ శివారున వెదురుపాక, గుమ్మలదొడ్డి, బావాజీపేట గ్రామాలకు జగనన్న కాలనీలో నిర్మించారు. ఆ కాలనీకి సరైన రోడ్డు మార్గం లేక కాలిబాటల మార్గం ద్వారా కాలనీవాసులు వెళుతున్నారు. మొన్న తుఫాన్ కు కురిసిన భారీ వర్షాలకు కాలిబాట మార్గం బురదమయంగా తయారవడంతో ఆ కాలనీ వాసు లు నడవలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.