భారత్‌కు ఇరాన్ సాయం చేసింది: సోనియా
భారత్‌కు ఇరాన్‌కు మధ్య వందల ఏళ్ల బంధం ఉందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు. టెహ్రాన్‌తో నాగరికత, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. భారత్‌కు ఇరాన్ అనేక సందర్భాల్లో సాయం చేసిందని గుర్తు చేశారు. ఆ దేశంపై అమెరికా దాడిని ఖండించకుండా యూఏఈపై దాడిని ప్రధాని మోదీ ఖండించటం ఏమిటని ప్రశ్నించారు.