సొరకాయలపేటలో పశువైద్య శిబిరం
అన్నమయ్య: KVపల్లి(M) సొరకాయలపేట గ్రామంలో వారం పాటు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ సాదిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 40 పశువులకు చికిత్సలు, 53 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పశుసంపద అభివృద్ధికి ఇలాంటి శిబిరాలు దోహదం చేస్తున్నాయని ఆయన తెలిపారు.