బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శాంతి కుమార్ నియామకం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శాంతి కుమార్ నియామకం

WNP: ఘనపూర్ మండలానికి చెందిన బండారి శాంతి కుమార్‌ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో బీజేపీలో చేరిన శాంతి కుమార్ గతంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా, కోశాధికారిగా పనిచేశారు.