పాలకొల్లు నేతకి వైసీపీలో కీలక పదవులు
W.G: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకం జరిగింది. ఇందులో భాగంగా పాలకొల్లుకు చెందిన సీనియర్ నాయకుడు యడ్ల తాతాజీని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాతాజీ గతంలో డీసీఎంఎస్ ఛైర్మన్, మున్సిపల్ ప్రతిపక్ష నేతగా సేవలందించారు.