బొబ్బిలి ఐటీఐలో దరఖాస్తుల ఆహ్వానం

VZM: బొబ్బిలిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మూడో విడత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి. వి. శ్రీధర్ గురువారం తెలిపారు. యువత ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఐటీఐలో ఎలక్ట్రిషన్, ఫిట్టర్, టర్నర్, మిస్సనిస్ట్, డ్రాఫ్ట్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడ్లలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.