సీఎం సహాయ నిధి ఆపద్బాంధవి : ఎమ్మెల్యే
కృష్ణా; సీఎం సహాయనిధి పేదలకు ఆపద్భాంధవునిలా నిలుస్తోందని గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. విజయవాడ MLA కార్యాలయంలో మంగళవారం CMRF చెక్కుల పంపిణీ చేశారు. బాపులపాడు(M) తిప్పనగుంటకి చెందిన కొలవెంటి దాసుకు రూ.1,60,725, కానుమోలుకి చెందిన శేషపు వెంకట శివగిరికి రూ.72,800, ఉంగుటూరుకి చెందిన ప్రొద్దుటూరి ఇందిరమ్మకు రూ.1,35,307 CMRF చెక్కులు ఇచ్చారు.