రోడ్డు పైన బైఠాయించి వైసీపీ నాయకులు

రోడ్డు పైన బైఠాయించి వైసీపీ నాయకులు

TPT: చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వైసీపీ నాయకులు చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు గోవింద నామస్మరణలతో నిరసన చేపట్టారు. ఘటనా స్థలానికి డీఎస్పీ ప్రసాద్, సీఐ ఇమ్రాన్ బాషా ఇతర అధికారులు చేరుకుని కొంతమంది వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ పాదయాత్రలో ఐదుగురికి మాత్రమే అనుమతించారు.