రేపు ఆకివీడులో భగవద్గీత కంఠస్థ పోటీలు
W.G: టీటీడీ దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రేపు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు సమన్వయకర్త లంకా నాగ శశి కళ తెలిపారు. ఆకివీడు మాదివాడ కల్యాణ మండపంలో 6-9 తరగతులు, ఇంటర్మీడియట్ విభాగాలకు పోటీలు ఉంటాయి. 18-45 సంవత్సరాల వారికి 'నిత్యజీవితంలో భగవద్గీత-భావ విశ్లేషణ'పై పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు.