పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ

BDK: పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పెద్దమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రజనీకుమారి తెలిపారు.