'రైతులు పత్తిని ప్లాస్టిక్ సంచుల్లో తేవొద్దు'
VKB: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిబంధనల ప్రకారం, రైతులు తమ పత్తిని ప్లాస్టిక్ సంచులలో కాకుండా లూజ్‌గా(విడిగా) మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. ప్లాస్టిక్ సంచులలో పత్తి తీసుకురావడం వలన నాణ్యత తగ్గి, కనీస మద్దతు ధర (MSP) కోల్పోయే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.