VIDEO: గెడ్డ పోరంబోకు స్థలం ఆక్రమణ
VZM: డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేటలో సర్వే నం.101/23 గెడ్డ పోరంబోకు భూమిని రియల్ ఎస్టేట్ కోసం కప్పేస్తున్నారని గిరిజన సంఘ నాయకుడు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా వర్షపు నీరు పారే గెడ్డను మట్టితో నింపి ప్లాట్లు వేస్తే చెరువులు, వ్యవసాయం దెబ్బతింటాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గెడ్డను రక్షించాలని రైతులు కోరుతున్నారు.