ప్రత్యేక అలంకారంలో శనీశ్వర స్వామి

ప్రత్యేక అలంకారంలో శనీశ్వర స్వామి

CTR: పుంగనూరు రూరల్ దండుపాళ్యం గ్రామంలో శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామి వారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయాన్నే అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు తైలాభిషేకాలు, ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కాగా, ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.