ఎమ్మెల్యేకు 104 ఉద్యోగుల వినతి

ఎమ్మెల్యేకు 104 ఉద్యోగుల వినతి

KKD: కరప మండలంలో104 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వేతన బకాయిల కోసం ఆదివారం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కలిశారు. గతంలో సర్వీసులను నిర్వహించిన అరబిందో సంస్థ తమకు వేతనాలు బకాయి పడిందని, వాటిని మంజూరు చేయించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధి త్రిమూర్తులు పలువురు ఉద్యోగులు ఉన్నారు.