VIDEO: పేదలకు ఇళ్ల స్థలాల డిమాండ్‌తో సీపీఐ ధర్నా
KRNL: పేదలకు ఇళ్ల స్థలాలు తక్షణం కేటాయించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కోడుమూరు సచివాలయం ముందు ధర్నా జరిగింది. అప్లై చేసిన ప్రతి అర్హుడికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు కేటాయించాలని మండల కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం చేపట్టాలని, పంపిణీలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలన్నారు.