రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ బంద్

రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ బంద్

MBNR: జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ప్రైవేటు ఆపరేటర్లు కొన్ని బస్సులను నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పెర్కొన్నారు.