ఆన్‌లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆన్‌లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

W.G: ఆకివీడులో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో "రూ.999కే మూడు డ్రస్సులు" అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకుంది. సోమవారం బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్సై హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.