ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
KMM: పెనుబల్లి మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.