జిల్లా కేంద్రంలో పందుల బెడద

జిల్లా కేంద్రంలో పందుల బెడద

జగిత్యాల: పట్టణంలోని వీధుల్లో పందులు యధేచ్చగా తిరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరేత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వర్షాకాలంలో పందులు విచ్చలవిడి సంచారంవల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.