ఇక్కడ మటన్ తింటే ఫిదా అవ్వాల్సిందే..!

ఇక్కడ మటన్ తింటే ఫిదా అవ్వాల్సిందే..!

NRPT: అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి జాతరలో నిప్పులపై కాల్చిన మటన్ తింటే ఫిదా అవ్వాల్సిందే. వేసవికాలం ప్రారంభంలో ఇక్కడ జాతర నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ సమయంలో మూగ జీవాలకు ఎలాంటి రోగాలు ఉండవని భక్తుల నమ్మకం. ఇక్కడి వ్యాపారులు 3 నెలల ముందు నుంచే మసాలాలు తయారు చేసుకోవడం ఇక్కడ మరో విశేషం. ఈ నెల 5వ తేదీ నుంచి ఉగాది వరకు ఈ జాతర కొనసాగుతుందని భక్తులు తెలిపారు.