పొన్నూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

GNTR: పొన్నూరు పట్టణంలో శనివారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త వ్యర్ధాలను తొలగించి, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.