ఖమ్మం జిల్లాలో క్రీడలు లేని ‘ప్రాంగణాలు'

KMM: పల్లెల్లో క్రీడలను ప్రోత్సహించటంతో పాటు మట్టిలో ఉన్న మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసే ప్రధాన ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన పల్లె క్రీడాప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వ హయంతో హడావుడిగా ఏర్పాటు చేసిన ఈక్రీడా ప్రాంగణాల వలన కలిగిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి.