ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన మాల మహానాడు నాయకులు

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని బోయపల్లిలో మాలలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్‌కు మాల మహానాడు నాయకులు బుధవారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటస్వామి మాట్లాడుతూ.. స్థలం కేటాయించడంతో పాటు నిర్మాణానికి 20 లక్షల కూడా కేటాయించారన్నారు.