154 మద్యం బాటిళ్లు స్వాధీనం
VSP: కొమ్మాది జంక్షన్‌లోని బెల్ట్ దుకాణాలపై పీఎంపాలెం పోలీసులు శుక్రవారం రైడ్ చేశారు. కొమ్మాది బైరవ వైన్ షాప్ పక్కన ఉన్న పాన్ షాప్ ఎదురుగా బెల్ట్ షాప్ నడుపుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై ఎన్. సునీత ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేశారు. బెల్ట్ దుకాణంలో 154 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.