VIDEO: కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
NLG: వేములపల్లి మండలంలోని సాగర్ ఎడమ కాలవలో గల్లంతైన రావులపెంట గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకన్న మృతదేహం లభ్యమైంది. పొనుగోడు రిజర్వాయర్ సమూహంలో వెంకన్న లభ్యమైనట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ తరలించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు.