అర్ధాంతరంగా ఆగిపోయిన సచివాలయ పనులు

అర్ధాంతరంగా ఆగిపోయిన సచివాలయ పనులు

NDL: చాగలమర్రి (మం) మల్లెవేములలో సచివాలయ భవన నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.30 లక్షలతో పనులు ప్రారంభించినప్పటికి, నిధుల కొరత, పాలన మార్పుతో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ భవనం దిష్టిబొమ్మలా కనిపిస్తోంది. ప్రభుత్వం చొరవ చూపి మిగిలిన పనులు పూర్తి చేసి, సచివాలయాన్ని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.