గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధం: కలెక్టర్
KDP: జనవరి మొదటి వారంలో గండికోటలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం ఆయన గండికోటలో పర్యటించి, శాస్కి పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను, ఒబేరాయ్ స్టార్ హోటల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.