VIDEO: పత్తికొండలో టీడీపీ నాలుగు మండలాల కమిటీల ప్రకటన
KRNL: పత్తికొండ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాంబాబు నాలుగు మండలాల కమిటీలను ప్రకటించారు. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే కోరారు. భవిష్యత్తులో జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసేందుకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.