గురజాల సబ్ జైలును తనిఖీ చేసిన ఎస్‌డీపీఓ

PLD: గురజాల సబ్ జైలును బుధవారం ఎస్‌డీపీఓ జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని గదులు, వంటశాలను పరిశీలించి ఖైదీలకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రికార్డులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జైలు భద్రత, నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.